ETV Bharat / state

పశువుల పండుగ నిర్వహణపై సందిగ్ధత

పశువులలను ఆరాధిస్తూ చిత్తూరు జిల్లా రంగంపేట రైతులు జరుపుకునే పశువుల పండుగపై ఉత్కంఠ నెలకొంది. కరోనా ఆంక్షలు, పశుహింస పేరిట పోలీసులు ఉత్సవాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు వేదన చెందుతున్నారు. పశువుల పండుగను జల్లికట్టుతో పోల్చడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు... ఎన్ని అడ్డంకులు వచ్చినా సంప్రదాయాన్ని వీడేది లేదంటున్నారు.

పశువుల పండుగ నిర్వహణపై సందిగ్ధత
పశువుల పండుగ నిర్వహణపై సందిగ్ధత
author img

By

Published : Jan 15, 2021, 4:13 AM IST

Updated : Jan 15, 2021, 4:59 AM IST

పశువుల పండుగ నిర్వహణపై సందిగ్ధత

కనుమ నాడు చిత్తూరు జిల్లా జిల్లాలోని రంగంపేట సహా పలు గ్రామాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పశువుల పండుగ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. కరోనా ఆంక్షలు, పశువులను హింసించే ఆచారంగా భావించిన పోలీసులు... ఈ ఏడాది పశువుల పండుగ నిర్వహణపై ఆంక్షలు విధించారు

చిత్తూరు జిల్లా రంగంపేట సహా కొన్ని గ్రామాల్లో ఏటా జనవరి 15 నుంచి నెల చివరి వరకు పశువుల పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఏడాది పొడవునా చేదోడువాదోడుగా ఉంటూ... సాగులో సాయంగా నిలిచిన పశువులను ఆరాధిస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పండుగ ముందు రోజు నుంచే పశువులను శుభ్రంగా కడిగి... కొమ్ములకు పలకలు కట్టి అలంకరిస్తారు. ఊరు చివర పశువుల దొడ్డి ఏర్పాటు చేసి పశువులను అక్కడికి చేరుస్తారు. అప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి.... గ్రామంలోని ఇరుకు సందుల్లో చేరుకున్న జనాల మధ్యకు ఒక్కొక్కటిగా పశువుల్ని వదులుతారు. వాటిని నిలువరించి కొమ్ములకు కట్టిన చెక్క పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీపడతారు.

పశువుల పండుగ నిర్వహణపై ఆంక్షలు విధించడాన్ని రంగంపేట ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభివృద్ధికి అండగా నిలిచిన పశువుల్ని పూజిస్తూ తరాలుగా జరుపుకుంటున్న ఆచారాన్ని అడ్డుకోవద్దని కోరుతున్నారు. పశువుల పండుగను తమిళనాడులో జరిగే జల్లికట్టుతో పోల్చడాన్ని రంగంపేట ప్రజలు తప్పుపడుతున్నారు. రెండింటికీ పోలికే లేదంటున్నారు. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా... పశువుల పండుగ ఉత్సవాలు ఆపేదిలేదంటున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన పోటీలకు ఫైనల్‌గా భావించే కనుమ నాటి ఉత్సవాలపై..... నీలినీడలు కమ్ముకోవడం స్థానికులను నిరాశకు గురిచేస్తోంది.

ఇవీ చదవండి

తిరుమ‌ల‌లో ముగిసిన ధ‌నుర్మాస పూజలు

Last Updated : Jan 15, 2021, 4:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.