చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు(case filed on tdp leaders at kuppam). కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి అమరనాథరెడ్డితోపాటు మరో 19 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ గంగయ్య(Dsp Gangaiah on kuppam incident) వెల్లడించారు. కుప్పం 14వ వార్డు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించడంతో సోమవారం రాత్రి కుప్పం పురపాలక సంఘం కార్యాలయాన్ని తెదేపా శ్రేణులు ముట్టడించారు. ఈ క్రమంలో తనపై దాడికి ప్రయత్నించారని, కార్యాలయ అద్దాలను పగలగొట్టడంతోపాటు తన విధులకు ఆటంకం కలిగించాలని పోలీసులకు మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు ఫిర్యాదు చేశారు.
ఏం జరిగిందంటే..
కుప్పం పురపాలిక కార్యాలయం వద్ద తెదేపా నేతలు నిరసనకు దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 14వ వార్డు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించటంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. పోలీసులు, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి చొక్కా చిరిగింది. దీంతో ఆగ్రహించిన తెదేపా శ్రేణులు..పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి..