చిత్తూరు జిల్లా పూతలపట్టు సమీపంలోని గాండ్లపల్లి వద్ద ఓ కారు అగ్నికి ఆహుతి అయ్యింది. నూతనంగా నిర్మిస్తున్న తిరుపతి - పూతలపట్టు రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలను గమనించి వాహనదారులు అప్రమతమై కారు నిలిపివేయటంతో వారికి ప్రాణాపాయం తప్పింది. తొలుత మంటలను ఆర్పేందుకు ప్రయత్నిచినా వీలు కాకపోవటంతో మరో వాహనంలో వాహనదారులు వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనదారులు ఎవరై ఉంటారనే దానిపై ఆరా తీస్తున్నారు. వారు తమిళనాడు ప్రాంతానికి చెందినవారుగా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందించారు. మంటల్లో పూర్తిగా దగ్ధమైన కారును రహదారిపై నుంచి తొలగించారు.
ఇవీ చదవండి