చిత్తూరు జిల్లా తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుచ్చి వాహన సేవ నిర్వహించారు. తిరుచ్చి వాహనంపై విహరించిన చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహుడు భక్తులను కటాక్షించారు. ఆలయం నుంచి తిరుమాడ వీధుల్లో.. మంగళ వాయిద్యాలు, నృత్యాల నడుమ స్వామివారిని ఊరేగించారు. అనంతరం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు.
ఇదీ చదవండి: ఈ ఆలయం దేశంలో రెండోది.. ఆంధ్రాలో మెుదటిది