చిత్తూరు జిల్లా సి.టి.యంలో కిడ్నాపైన బాలుడు అశోక్ (6) కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు... సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 13 బృందాలుగా 14 రోజుల పాటు తిరిగిన పోలీసుల కృషి ఫలించింది. ప్రజలు అందించిన పక్కా సమాచారంతో వాయల్పాడు రైల్వేస్టేషన్లో బాలుడిని, కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని వారి తల్లికి అప్పగించారు. కిడ్నాప్ చేసిన వారిపై కేసు నమోదు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి... పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ రవి మనోహరాచారి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :