భాజపా ఇచ్చిన పిలుపుతో చిత్తూరు జిల్లా పుత్తూరు బైపాస్ రోడ్డులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. రోడ్డుపై ఉన్న గుంతలో చేపలు పడుతూ, పేపర్లతో తయారు చేసిన పడవలు వదులుతూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా మారినా వైకాపా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రమేష్ నాయుడు విమర్శించారు.
కేంద్రమిచ్చే నిధులతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సొంత పేర్లు పెట్టుకున్నారని రమేష్ ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలను మరిచి సొంత అజెండాతో ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్తున్నారని రమేష్ అన్నారు. ఇప్పటికైనా రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైకాపాకు బుద్ధి చెప్పే విధంగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఫలితాలు ఉంటాయని చెప్పారు.
ఇదీ చదవండి