జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న ఓబీసీ మోర్చా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట శివ నారాయణ పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు వారి కుల వృత్తులతో శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం నుంచి ఎన్వీఎస్ కళ్యాణ మండపం వరకు ప్రదర్శనలతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పురందేశ్వరి, సునీల్ జావడేకర్ తదితర జాతీయ నేతలు పాల్గొంటారని తెలిపారు.
ఇదీ చదవండి :