ETV Bharat / state

'తితిదే ఆస్తుల అమ్మకంపై ఓటింగ్ పెట్టండి'

తితిదే ఆస్తుల అమ్మకంపై ఈ నెల 28న జరిగే పాలక మండలి సమావేశంలో ఓటింగ్‌ నిర్వహించాలని తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు భానుప్రకాశ్​​రెడ్డి ధర్మకర్తల మండలి అధ్యక్షుడికి సవాల్‌ విసిరారు.

bjp leader bhanuprakash reddy on ttd lands selling
తితిదే భూములపై భానుప్రకాశ్
author img

By

Published : May 25, 2020, 12:26 PM IST

గతంలో స్వామివారి ఆస్తులను విక్రయించకుండా తాము చూశామని తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు భానుప్రకాశ్​రెడ్డి అన్నారు. గతంలోనే తితిదే ఆస్తుల విక్రయానికి నిర్ణయం తీసుకున్నా, అమ్మకాలు జరగకుండా నిలవరించామన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుతం ఎందుకు మార్చకూడదంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నెల 28న జరిగే సమావేశంలో ఆస్తుల విక్రయంపై ఓటింగ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తితిదే ధనార్జన సంస్థ కాదనీ... థార్మిక సంస్థ అని గుర్తు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధానాలు వెనక్కి తీసుకోవాలని కోరారు. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు అయోధ్య కరసేవ తరహా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: శ్రీవారి ఆస్తుల విక్రయానికే తితిదే మొగ్గు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.