భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని భాజపా, జనసేన నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో నిరసన చేపట్టారు. తుపాను కారణంగా నష్టపోయిన పాడి రైతులను ఆదుకోవాలని కోరారు.
ఎడతెరిపిలేని వర్షాలకు రహదారులు ధ్వంసమయ్యాయని జనసేన నియోజకవర్గ బాధ్యులు యుగంధర్ అన్నారు. పాడైపోయిన రహదారులను పునర్ నిర్మించాలంటూ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రోడ్డుపై గుంతలో చేపలు పడుతూ భాజపా నిరసన