చిత్తూరు జిల్లా పీలేరులో మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా రెండు కోట్ల సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతల మోహన్ రావు పాల్గొన్నారు. మూడు బిల్లులను వ్యవసాయరంగ నిపుణులతో చర్చించకుండా హడావిడిగా తీసుకరావడం అప్రజాస్వామికమన్నారు. ఈ బిల్లులు వ్యవసాయ సంక్షోభానికి, రైతు వినాశనానికి దారితీస్తాయని... అన్నారు. ఈ వీటి ద్వారా పండించే పంటలకు కనీస మద్దతు ధర దక్కదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీలు అంతరించిపోతాయన్నారు.
ఇదీ చూడండి. తెలంగాణ: సహాయక చర్యలు లేకపోతే మీ పేరు రాసి చనిపోతాం!