ETV Bharat / state

పాల డెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీక్​..ప్రమాదంపై విచారణ - చిత్తూరు అమ్మోనియం గ్యాస్ లీక్ వార్తలు

హట్సన్‌ పాల డెయిరీ ప్రమాదంలో అమ్మోనియా తీవ్రతను తట్టుకోలేక 14 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయిన ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో చోటు చేసుకుంది. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు గ్యాస్ లీక్​పై అధికారులు విచారణ చేపట్టారు.

chittor gas leak
పాలడెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీక్ పై విచారణ
author img

By

Published : Aug 21, 2020, 3:06 PM IST

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని ఎం.బండపల్లి సమీపంలో గురువారం రాత్రి అమ్మోనియా గ్యాస్ ఘటనలో 14 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో భాగంగా... శుక్రవారం జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు ఆర్డీఓ రేణుక, బీఎఫ్ బాలరాజు, డిప్యూటీ చీఫ్ ఇన్​స్పెక్టర్​ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్ శుక్రవారం హాట్ సన్ డెయిరీని సందర్శించి గ్యాస్ లీక్​పై విచారణ చేపట్టారు.

గ్యాస్ లీక్ అయిన సమయంలో... అలారం మోగకపోవటం తీవ్ర తప్పిదంగా ఆర్డీవో పరిగణించారు. నివేదికలను జిల్లా పాలనాధికారికి సమర్పించిన అనంతరం చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

ఇవీ చదవండి:
ఫోన్ ట్యాపింగ్​ వ్యవహారంపై విచారణ వారం రోజులకు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.