సర్పంచి అభ్యర్థి భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కందాడ పంచాయతీలో జరిగింది. గ్రామానికి చెందిన రాధాకృష్ణారెడ్డి భార్య దేవకమ్మ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పక్క గ్రామమైన రాచపాళ్లెంలో ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాధా కృష్ణరెడ్డిపై కత్తితో దాడి చేశారు. క్షతగాత్రుడిని తిరుపతిలో ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏర్పేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: