ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వ సాయం... నిరుద్యోగ యువతకు వరం

కళాశాలల్లో నేర్చుకున్న సబ్జెక్టుకు ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. దీనివల్ల అనేక మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులను దూరం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలను రూపొందించింది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్​ఎస్​డీసీ) ద్వారా రాష్ట్రంలోని యువతను నైపుణ్యం దిశగా అడుగులు వేయిస్తోంది.

శిక్షణ తీసుకుంటున్న యువత
author img

By

Published : May 7, 2019, 8:04 AM IST

Updated : May 7, 2019, 9:01 AM IST

యువతకు చేయూత
బయట మార్కెట్ తీరుకు అనుగుణంగా ఆయా కంపెనీలు కోరుకుంటున్న అవసరాలను బట్టి.... ప్రత్యేకంగా వృత్తి నైపుణ్య కోర్సులను రూపొందించిన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీలో నెలకొల్పిన 6 సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాల ద్వారా వాటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుపతిలో ఎస్వీ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోని సీమెన్స్ సీఈసీలో ఇప్పటికే ఈ కోర్సులకు శిక్షణ ప్రారంభం కాగా యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. కోర్సుల కోసం బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసే కంటే ప్రభుత్వం స్కిల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన అవకాశాన్ని యువతీ యువకులు అందిపుచ్చుకుంటున్నారు. ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు కొనసాగే ఈ కోర్సుల ద్వారా నైపుణ్యాలు పెంచుకుంటున్నారు యువత. సాంకేతికపరంగా, పారిశ్రామికపరంగా విద్యార్థులను ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు. ఈఈఈకి సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎనర్జీస్ స్టడీస్, ట్రిపుల్ ఈ, ఈసీఈ విద్యార్థుల కోసం ఇండస్ట్రియల్ ఆటో మేషన్... మెకట్రానిక్స్ అండ్ ప్రొసెస్ ఇన్​స్ట్రుమెంటేషన్, మెకానికల్ విద్యార్థుల కోసం కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, సీఎన్​సీ ప్రోగ్రామింగ్ అండ్ మ్యాచింగ్ తదితర అధునాతన కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం నామమాత్ర రుసుం కింద 3వేల నుంచి 5వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు.

అలసిన యువతకు ఆసరా
ప్రతీ సంవత్సరం వేల సంఖ్యలో ఇంజినీరింగ్ పట్టభద్రులు తయారవుతున్నా బయటి మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేకపోవటమే నిరుద్యోగానికి కారణంగా భావించి ఈ కోర్సులను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. చదివిన చదువుకు తగిన ఉద్యోగాలు లేక ఆయా కంపెనీలు అడిగే అర్హతలు సాధించలేక ఇన్నాళ్లూ డీలాపడిన ఇంజినీరింగ్ యువత ఈ వృత్తి నైపుణ్య కోర్సుల ద్వారా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Intro:ap_vsp_76_06_counting_sikshanaku_8mandi_amaravathi_paderu_av_c11

పాడేరు, శివ

యాంకర్: ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఈనెల 7న అమరావతిలో ఎన్నికల సంఘం నిర్వహించే శిక్షణ శిబిరానికి విశాఖ నుంచి ఎనిమిది మంది అధికారుల బృందం వెళ్లనుంది వీరిలో లో జెసి సృజన, పాడేరు ఐటిడిఎ పిఓ డి కె బాలాజీ, పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ , జెసి 2 ఎం వెంకటేశ్వరరావు, ఎం ఐ సి శాస్త్రవేత్తలు వై వి కే ఎస్ ఆర్ మూర్తి , హమీద్ పాషా, మరో ఇద్దరు రిటర్నింగ్ అధికారులు శిక్షణకు వెళ్లనున్నారు వీరంతా ఈ రోజు రాత్రి ఇ విశాఖ నుంచి బయలుదేరి అమరావతి వెళ్తారు ఓట్ల లెక్కింపులో తీసుకోవలసిన జాగ్రత్తలు కొత్తగా వచ్చిన వి వి ప్యాట్ లెక్కింపు తదితర అంశాలపై ఎన్నికల సంఘం క్షణ ఇవ్వనుంది కొత్తగా సర్వీసు ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్ మిషన్ పోస్ట్ బ్యాలెట్ విధానం ఓట్లను లెక్కించే విధివిధానాలపై పూర్తిస్థాయిలో శిక్షణ పొందేందుకు ఎనిమిది మంది వివిధ రిటర్నింగ్ అధికారుల బృందం అమరావతి చేరుకోనుంది
శివ, పాడేరు

Body:శివ

Conclusion:పాడేరు
Last Updated : May 7, 2019, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.