ETV Bharat / state

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా... అంబేడ్కర్ జయంతి వేడుకలు - chittoor latest news

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల, సంఘాల నాయకులు అంబేడ్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూల మాలలు వేసి అంజలి ఘటించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

ambedkar jayanthi celebrations in chittoor
చిత్తూరు జిల్లా అంబేడ్కర్ వేడుకలు
author img

By

Published : Apr 14, 2021, 6:03 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలను దళిత ఐక్యవేదిక అంబేడ్కర్ ఆశయ పోరాట సమితి ఘనంగా నిర్వహించింది. ఆ సంఘం నాయకులు రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

తంబళ్లపల్లె నియోజకవర్గంలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పోర్టు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎంపీడీవో దివాకర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఏఈ వెంకట్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి: చింతా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.