ETV Bharat / state

వలసకూలీల పాలిట దేవుడు సోనూ సూద్! - సోనూ సూద్ తాజా వార్తలు

సినిమాల్లోనే అతను చెడ్డోడు. నిజజీవితంలో మాత్రం రేలంగి మావ‌య్య అంతటి మంచోడు. ఇంకా చెప్పాలంటే అంతకంటే వందరెట్లు ఎక్కువ మేలిమి బంగారం. లాక్‌డౌన్‌ వేళ ఇళ్లకు చేరుకోవాలన్న తాపత్రయంతో అలుపెరగక నడుస్తున్న వలసకూలీల వెతలను చూసి చలించిపోయాడు. వారందరినీ స్వస్థలాలకు చేర్చడమే రేయింబవళ్లు అతని ఆలోచన. తన సంపాదనంతా పోయినా పర్లేదు.. వారి పెదాలపై చిరునవ్వు చూడటమే తనకున్న స్వార్థమనుకుంటూ...వలసకూలీల పాలిట ఆపద్బాంధవుడిలా నిలుస్తున్న నిలువెత్తు సహాయమే....సోనూ సూద్‌.

actor sonu sood helping migrant workers
వలసకూలీల పాలిట దేవుడు సోనూ సూద్
author img

By

Published : May 31, 2020, 9:03 AM IST

వలసకూలీల పాలిట దేవుడు సోనూ సూద్

'వదల బొమ్మాళి' అంటూ దాదాపు పుష్కరం క్రితం ప్రేక్షకులను భయపెట్టిన సోనూ సూద్‌... తెలుగువారందరికీ సుపరిచితమే. విలనీని ప్రదర్శించడంలో అతనిదో సెపరేట్‌ స్టైల్‌. ఆరడుగుల ఎత్తు, ఆరుపలకల దేహంతో హీరోకి ఏమాత్రం తీసిపోనట్టు ఉండే సోనూసూద్... దక్షిణాది, ఉత్తరాది చిత్రపరిశ్రమల్లో గత కొన్నేళ్లుగా డిమాండ్ ఉన్న నటుడే. తెరపై అతను విలనైనా.... కరోనా తీసుకొచ్చిన కష్టం... అతనిలోని మంచిమనసును అందరికీ పరిచయం చేసింది. పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం తరలివచ్చిన వలసకూలీల వెతలు అతణ్ని కదిలించింది. చంటిబిడ్డలను చంకన పెట్టుకుని వేల కిలోమీటర్లు నడుస్తున్న వారందరికీ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. తనను ఆదరించి ఇంతటి వాడిని చేసిన ప్రజలకు ఏదైనా చేయాలన్న సత్సంకల్పమే అతణ్ని ఇప్పుడు జాతీయస్థాయిలో సూపర్‌స్టార్‌గా నిలిపింది. సోనూలో రగులుతున్న అంతర్మథనమే అతణ్ని ఈ దిశగా నడిపింది.

మూలాలు మర్చిపోకూడదు

మనం ఎంత ఎత్తుకు ఎదిగినా... మూలాలను మర్చిపోకూడదు అంటుంటారు. సోనూ అదే పాటించాడు. 23ఏళ్ల క్రితం ఉపాధి కోసం మహారాష్ట్రకు రాక... సినీ అవకాశాల కోసం చక్కర్లు.... రైల్లో బాత్రూం పక్కన నిద్రిస్తూ చేసిన ప్రయాణాలు... ఇలా ప్రతిదీ తనకు గుర్తే. 1997 నాటి రైల్వే పాస్‌ను సైతం ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాడు. శ్రమ,ప్రతిభకు అదృష్టం తోడై సినిమాల్లో మంచిపేరు సంపాదించాడు. కరోనా కష్టకాలంలో సమాజానికి తిరిగి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో తొలుత... ముంబయిలోని అంథేరీ, జుహు ప్రాంతాల్లోని కూలీలకు ఆహారమందించాడు. స్వస్థలాలకు కాలిబాటన వెళ్తున్న వారి కష్టాలు చూసి.... అందరినీ ఇళ్లకు చేర్చే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. మహారాష్ట్రలో చిక్కుకున్న వారిని తరలించేందుకు అధికారుల నుంచి అనుమతులు తీసుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాడు. ఇళ్లకు వెళ్తున్నామన్న వారి చిరునవ్వు అతనికి ఎనలేని సంతృప్తినిచ్చింది. ముంబైలో సోనూసూద్‌ చేస్తున్న ఈ సాయం... సామాజిక మాధ్యమాల ద్వారా దేశమంతటా విస్తరించింది. ఎన్నో రాష్ట్రాల్లో ఇరుకున్న వేల మంది నుంచి అతనికి వినతుల రాక ప్రారంభమైంది..

ఏకంగా కంట్రోల్ రూం ఏర్పాటు!

తనకొస్తున్న వినతుల పరిష్కారానికి ఓ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసుకున్నాడు... సోనూ. అంతకంతకూ వాటి సంఖ్య పెరుగుతుండటంతో... ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌కు తొలిరోజే 70వేల వినతులు వచ్చాయంటే.... అతని మంచితనం దేశమంతటా అంతలా పాకింది. వారందరికీ భరోసా ఇచ్చిన సోనూ... ఆయా రాష్ట్రాలతో మాట్లాడి ప్రత్యేక బస్సులు, అందరికీ కరోనా పరీక్షలు, ఆహార ఏర్పాట్లు చేశాడు. ఇలా ఇప్పటిదాకా 9 రాష్ట్రాల నుంచి 45వేల మందిని వారి ఇళ్లకు చేర్చాడు. తాజాగా... కేరళలో ఇరుక్కున్న 169 మందిని ఒడిశాకు తరలించేందుకు 25లక్షలు వెచ్చించి ఓ విమానం ఏర్పాటు చేయడం..అతని దాతృత్వానికి నిదర్శనం. వారిలో దాదాపుగా అందరూ మహిళలే ఉండటంతో.... అంత దూరం బస్సుల్లో రాలేరని గ్రహించి విమానాన్ని బుక్‌ చేశాడు. స్వస్థలాలకు ఎలాగోలా పంపేయకుండా.. వారి సాధకబాధకాలను అర్థం చేసుకుంటున్న తీరు... నిజంగా అభినందనీయం.....

ఆఖరి వలస కూలీని ఇంటికి చేర్చే వరకు ఆపను

ప్రస్తుతం రోజుకు వెయ్యి మందికిపైగా ఇళ్లకు చేరుస్తున్న సోనూ... వారంతా సంతోషంతో చేస్తున్న ట్వీట్లు చూసే సంతృప్తి చెందుతున్నాడు. ఇదే కాక... ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌తో కలిసి ఈ కష్టకాలంలో రోజూ 50వేల మంది ఆకలి తీరుస్తున్నాడు. జుహూలో తనకున్న ఆరంతస్తుల విలాసవంతమైన హోటల్‌ శక్తిసాగర్‌ను... కరోనా యోధులైన వైద్యులు, నర్సుల బసకు ఉచితంగా ఇచ్చేశాడు. సోనూ ఉదార స్వభావానికి దేశమంతా సామాజిక మాధ్యమాల ద్వారా అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఉన్నదంతా దానం చేస్తే రేపు నీ కుటుంబానికి ఏం పెడతావు అని అడిగినవారికి... తన ఒంటిలో ఓపికున్నంత కాలం మళ్లీ సంపాదించుకోగలనని.... ప్రస్తుతం ఆఖరి వలసకూలీని ఇంటికి పంపడంలో మాత్రం తన వంతు సాయాన్ని ఆపనంటున్నాడు సోనూసూద్.

ఇదీ చదవండి: కరోనాతో దేశంలో ఒకేరోజు 3 రికార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.