ETV Bharat / state

'జయహో బీసీ' సభ పెట్టే అర్హత జగన్ రెడ్డికి లేదు: టీడీపీ - chithur latest news

చిత్తూరు జిల్లా పుంగనూరులో జనసేన బీసి నేత రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బీసీలను అణగదొక్కుతూ.. జయహో బీసీ అంటూ సభ పెట్టే అర్హత జగన్ రెడ్డికి ఉందా అని నిలదీశారు. బీసీలపై జగన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు.

అచ్చెన్నాయుడు
Achenna
author img

By

Published : Dec 5, 2022, 5:17 PM IST

Atchannaidu respond on Punganur incident: బీసీలపై జగన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో జనసేన బీసి నేత రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై గళమెత్తితే దాడులు చేస్తారా అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను అణచివేసేలా జగన్ రెడ్డి వ్యవహారం ఉందని దుయ్యబట్టారు.

రైతు సమస్యలపై సభ పెట్టడమే నేరం అన్నట్లుగా దాడి చేశారని విమర్శించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకానికి, జగన్ రెడ్డి దుర్మార్గానికి ఈ దాడి నిదర్శనమని మండిపడ్డారు. బీసీలను అణగదొక్కుతూ.. జయహో బీసీ అంటూ సభ పెట్టే అర్హత జగన్ రెడ్డికి ఉందా అని నిలదీశారు. బీసీలపై పడే ఒక్కో దెబ్బ.. 2024లో జగన్ రెడ్డికి బీసీలు సమాధానం చెబుతారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఓ బీసీ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారని నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై సదస్సు నిర్వహించడం తప్పా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే దాడి చేయడమే వైకాపా నేతలకు తెలిసిన రాజకీయమని దుయ్యబట్టారు. ఓ వైపు బీసీ నేతలపై దాడి చేసి.. మళ్లీ బీసీ సభ అంటూ డ్రామాలు సిగ్గుచేటని విమర్శించారు. బీసీల హక్కుల్ని హరిస్తూ.. బీసీల సభలు పెట్టడం వైకాపా లాంటి డ్రామా పార్టీకే చెందిందని ఎద్దేవా చేశారు.

ఇవి చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.