చిత్తూరులోని రహదారులు, భవనాల శాఖ… చిత్తూరు డివిజన్ కార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల వివరాలు, మంజూరు చేసిన బిల్లులు, పెండింగ్‌లో ఉన్న బిల్లులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌ను ప్రశ్నించారు. సోదాలు జరుగుతున్న సమయంలో కార్యాలయ సిబ్బందిని బయటకు పంపించలేదు. అనిశా సీఐ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో సోదాలు నిర్వహించారు.
ఇదీ చదవండి: