అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రేమలత మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలత. భర్త సుధాకర్‌తో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటుంది. భర్త సుధాకర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీళ్లకు గీతాంష్ అనే రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు. అయితే మంగళవారం రాత్రి ప్రేమలత ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందింది.
ప్రేమలతది ఆత్మహత్య కాదని.. ఆమె భర్త సుధాకరే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తె మృతదేహాన్ని తమకు అప్పగించడానికి సుధాకర్ నిరాకరిస్తున్నాడని ఆరోపించారు. కుమార్తెను చివరిచూపుకు నోచుకోనియకుండా ఆమె భర్త వ్యవహరిస్తున్నాడని.. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని ప్రేమలత తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: