పెద్దమండ్యం మండలం గోపిదిన్నెకు చెందిన రాధ 3 ఎళ్ల కిందట బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లింది. తన తల్లి ఏడాది నుంచి మాట్లాడటం లేదని రాధ కూతురు సుకన్య ఏజెంట్‌ను సంప్రదించింది. ఏజెంట్ కూడా నమ్మలేని మాటలు చెప్పాడు. దీంతో సుకన్య పోలీసులను ఆశ్రయించింది. స్థానిక డీఎస్పీ ఆదేశాల మేరకు ఏజెంట్‌ను స్టేషన్కు పిలిపించి పోలీసులు విచారించారు. నెల రోజుల్లో రాధను స్వగ్రామానికి రప్పించాలని చెప్పారు. తన అమ్మ ఏడాదిగా కాలంగా సరిగా మాట్లాడటం లేదని... వాట్సప్‌లో పంపిన మాటలు తన తల్లి కావని సుకన్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాధ కూతురు సుకన్య మదనపల్లెలోని అమ్మమ్మ నరసమ్మ వద్ద ఉంటూ... డిగ్రీ చదువుతోంది. సుకన్య తండ్రి పాపన్న ఆమె చిన్న వయసులోనే మృతిచెందాడు.
ఇదీచూడండి.'రాజీనామా కాదు.. పృథ్వీరాజ్‌పై కఠినచర్యలు తీసుకోవాలి'