తిరుపతిలోని గరుడ వారధి నిర్మాణాలలో ప్రమాదం చోటు చేసుకొంది. లీలామహల్ కూడలి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వారధిపై వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో బీహార్కు చెందిన కార్మికుడు మంజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన అతణ్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన కార్మికుడి కుటుంబ సభ్యుడిని అన్ని విధాలా ఆదుకోవాలని గరుడవారధి నిర్మాణ సంస్థ అప్కాన్స్ యాజమాన్యాన్ని.. స్మార్ట్ సిటీ ఎం.డి. గిరీషా ఆదేశించారు. కార్మికుడి మృతదేహాన్ని బీహార్కు తరలించడానికి ఏర్పాట్లు చేశామని, కార్మిక చట్టం ప్రకారం మృతుడికి రావాల్సిన నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకొన్నామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి
JAGAN PLAYED CRICKET: సీఎం జగన్ బ్యాటింగ్..ఎంపీ అవినాష్ బౌలింగ్