‘ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే పెట్రోలు ధర తక్కువ.. ఇక్కడే కొట్టించుకోండి’ అని రాసిన బోర్డును తమిళనాడులోని ఓ పెట్రోలు బంకు వద్ద ఏర్పాటు చేశారు. వేలూర్ సరిహద్దులోని బంకు వద్ద.. ఏపీతో పోలిస్తే పెట్రోలు ధర రూ.7.89 తక్కువంటూ బోర్డుపై రాశారు. తమిళనాడులో కంటే ఏపీలో వ్యాట్, రోడ్ డెవలప్‌మెంట్ సెస్ పేరిట ధర ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్ర సరిహద్దులోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రజలు తమిళనాడు బంకుల వద్ద బారులు తీరుతున్నారు.
ఇదీ చదవండీ.. krmb meeting:వాడివేడిగా కృష్ణాబోర్డు భేటీ.. తెలంగాణకు 34%, ఏపీకి 66% నీటి వాటాలు