నగరి మున్సిపాలిటీలోని సత్రవాడ నుంచి ఓంశక్తి ఆలయం వరకు 5కే మారథాన్ జరిగింది. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఒక్కో మండలం నుంచి రెండు విభాగాల్లో 250 మంది పాల్గొన్నారు.
పట్టణంలోని ఎ.జె.ఎస్ కళ్యాణ మండపంలో ముఖ్యమంత్రికి జన్మదిన వేడుకలు నిర్వహించిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతిగా రూ.10,000, రెండవ విజేతకు రూ. 7,000, మూడవ బహుమతిగా రూ.4,000, నవరత్నాలుగా తొమ్మిది మందికి ఒకొక్కరికి వెయ్యి రూపాయలు బహుమతిగా ప్రకటించారు.
ఇదీ చదవండి:
సీఎం జన్మదినం సందర్భంగా విద్యార్థినిని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే రోజా