చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం కోగిలేరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతులు పెద్దపంజాని మండలం జిట్టంవారిపల్లె గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. బంధువుల దినకర్మకు వెళ్లి... తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే రామకృష్ణప్ప అనే వ్యక్తి మృతి చెందగా... పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ రాజన్న, మునిచంద్రా రెడ్డి మృతిచెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీమంత్రి అమరనాథ్‌రెడ్డి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఇదీ చదవండి :