చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెండోరోజు మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి 50శాతం ధరలు పెంచటంతో.... సవరణ కోసం మధ్యాహ్నం దాకా మద్యం దుకాణాలు మూసే ఉంచారు. సాయంత్రం ప్రారంభమైన మద్యం దుకాణాల వద్ద మందుబాబులు మళ్లీ బారులుతీరారు. మద్యం కోసం గంటల తరబడి వేచిచూసిన జనమంతా.... అమ్మకాల ప్రక్రియ ప్రారంభం కావటంతో దుకాణాల వద్ద క్యూకట్టారు. పెరిగిన ధరల ప్రభావంతో కొన్ని చోట్ల మాత్రం పెద్దగా మందుబాబుల తాకిడి కనిపించలేదు.
ఇదీ చూడండి వలస కార్మికుల గోస: ఇటు రానివ్వరు.. అటు తిరిగి పోలేరు