చిత్తూరు జిల్లా యర్రావారి పాళ్యం మండలంలోని శేషాచల అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. తలకోన అటవీప్రాంతంలోని పులిగుండ్లు వద్ద అక్రమంగా తరలిస్తోన్న 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఓ తమిళ స్మగ్లర్ను అదుపులోకి తీసుకోగా మరికొంతమంది అడవిలోకి పారిపోయారు. నిందితుడి వద్ద ఓ చంపిన అడవి ప్రాణిని గుర్తించారు. అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం సమీప ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి: