అనారోగ్య సమస్య వస్తే.. 108 వాహనానికి ఫోన్ చేయాలని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటారు. కానీ.. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండంలో గత కొన్ని రోజులుగా వీటి జాడ లేకుండా పోయింది. ఈ మండల పరిధిలో సుమారు 60 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రమాదంతో రోడ్లు రక్త మోడుతూనే ఉంటాయి.
పూతల పట్టు - నాయుడుపేట, తిరుపతి - అనంతపురం జాతీయ రహదారుల పై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అలాంటి చోట 108 వాహనం కనిపించకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే... చంద్రగిరి సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో సుమారు పద్దెనిమిది... 108 వాహనాలు కనిపించాయి. పాత వాహనాలకు కొత్త స్టిక్కర్లు అంటించి రహస్యంగా ప్రహరీ గోడ మధ్యలో వీటిని దాచేశారు. ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఎవరు చేస్తున్నారో అని.. స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: