ETV Bharat / state

"దొడ్డిదారిన విజయసాయిరెడ్డికి పెత్తనమా? "

వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధాన అజెండాగా వైకాపా ప్రభుత్వ వైఖరి ఉందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహించారు. రాజ్యాంగ విలువలనూ కాలరాస్తున్నారని మండిపడ్డారు.

తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు
author img

By

Published : Jul 6, 2019, 11:09 AM IST

తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు
తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు

విజయసాయి రెడ్డి కోసం రాజ్యాంగ విలువలను వైకాపా ప్రభుత్వం కాలరాస్తుందని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు విజయసాయి రెడ్డికి దిల్లీలో పట్టం కట్టేందుకే... తప్పుడు జీవో ఇచ్చి ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. తీరా గుట్టు రట్టయ్యేసరికి నాలుక కరుచుకొని జీవో రద్దు చేశారని దుయ్యబట్టారు.

దొడ్డిదారిలో ప్రభుత్వ ఎత్తుగడలు
13 రోజులపాటు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పదవిలో ఉన్న విజయసాయి రెడ్డిని... ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజ్యాంగ పెద్దలకు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయనుందని తెలిపారు. ఇది తెలిసి దొడ్డిదారిన మళ్ళీ విజయసాయి రెడ్డిని ప్రత్యేక ప్రతినిధిగా నియమించేందుకు ఇంకో ఎత్తుగడ వేశారన్నారు. ఆర్డినెన్సు ద్వారా విజయసాయి రెడ్డికి... దిల్లీ పదవి కట్టబెట్టే ప్రణాళిక వేశారన్నారు. దిల్లీలో తన కేసులపై లాబీయింగ్ కోసమే ఈ పదవి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని యనమల ఆరోపించారు.

రాజ్యాంగ విరుద్ధంగా ఆర్డినెన్సు జారీ

ఒక వ్యక్తి కోసం ఆర్డినెన్సు జారీ చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్సు జారీ చేసే అధికారం గవర్నర్​దేనని గుర్తుచేశారు. అత్యవసరమైతే, ప్రజాప్రయోజనాల కోసమే ఆర్డినెన్సు ఇవ్వాలన్నారు. సభ సెషన్​లో లేనప్పుడు, ప్రోరోగ్ చేసినప్పుడే ఆర్డినెన్సు ఇస్తారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆర్డినెన్సు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీనిని గవర్నర్ నరసింహం గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు 11 నుంచి, బడ్జెట్ 12 న అని ఇప్పటికే మీడియాలో చూశామని... ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగుస్తుందన్నారు. పూర్తికాలపు బడ్జెట్ నెలాఖరులోపు ఆమోదించాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్డనెన్స్‌ ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:
ఆ ముగ్గురి కృషిని ప్రజలు గుర్తించారు: కేశినేని నాని

Intro:శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం జి యస్ పురం ఉన్నత పాఠశాలకు కు రెడ్డీస్ ఫౌండేషన్ వారు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు .పాఠశాలకు క్రీడా పరికరాలను అందజేయడంతో పాటు విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగు నీటిని అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు , విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచేందుకు ఈ క్రీడా పరికరాలు దోహదపడతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ మూర్తి తెలిపారు పాఠశాలకు గత కొన్నేళ్లుగా త్రాగునీరు ఇబ్బందులు ఉన్నాయని రెడ్డీస్ ఫౌండేషన్ వారు విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ తో త్రాగునీటి సమస్య తీరిందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు

Body:రెడ్డీస్ ఫౌండేషన్ వారు g s puram ఉన్నత పాఠశాలకు క్రీడా పరికరాలతో పాటు మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది

Conclusion:రెడ్డీస్ ఫౌండేషన్ వారు జి ఎస్ పురం ఉన్నత పాఠశాలకు క్రీడా పరికరాలతో పాటు విద్యార్థులకు త్రాగు నీటి సమస్యలు తీర్చేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.