ETV Bharat / state

'రేకులు రాలిన కమలం.. రాఫెల్ బురదలో పడింది'

భాజపా జాతీయ అధ్యక్షుడు 'అమిత్ షా కాదు అబద్ధాల షా' అని యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రానికి 5లక్షల 56వేల 985 కోట్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని మండిపడ్డారు.

యనమల రామకృష్ణుడు
author img

By

Published : Apr 8, 2019, 7:33 PM IST

భాజపా జాతీయ అధ్యక్షుడు 'అమిత్ షా కాదు అబద్ధాల షా' అని యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రానికి 5లక్షల 56వేల 985 కోట్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పాటు ఇచ్చేవి కాదనీ.. ఏపీకి ప్రత్యేకంగా రావాల్సిన వాటి గురించి అడుగుతున్నామని స్పష్టంచేశారు. ఈ ఐదేళ్లలో భాజపా రాష్ట్రాలకు ఎంతిచ్చారో.. ఏపీకి ఎంత ఇచ్చారో... దానిమీద శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం మోదీ, షాలకు ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున ఇచ్చే ధైర్యం లేకపోతే కనీసం పార్టీ తరఫున అయినా ఇవ్వాలని సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేకహోదా ఎందుకివ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలవరానికి ఇవ్వాల్సిన 4వేల 500 కోట్లు ఇవ్వకుండా.. ఏటీఎం అని ఎదురుదాడి చేస్తారా అని మండిపడ్డారు. ఓటమి భయంతో మోదీ, షాల వేధింపులు ఎక్కువయ్యాయని విమర్శించారు. భాజపాను ప్రశ్నించిన ముఖ్యమంత్రులనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీకి లొంగిన వారిపై వేధింపులు లేవన్నారు. కమలానికి రేకుల్లా ఉన్న అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా వారు పార్టీని వదిలేశారనీ.. ఇప్పుడు మోదీ రేకులు రాలిన కమలం లాంటివారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కారు రేకు, జగన్ ఫ్యాన్ రేకు అతుకులు వేసుకుంటున్నారని చురకలంటించారు.

ఇవీ చదవండి.

మీకు కాపు కాశా.. మీరంతా నాకు కాపు కాయాలి: చంద్రబాబు

Intro:శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ్రు మురళి విస్తృతంగా ప్రచారం చేపట్టారు రాజాం లోని ఎల్ఐసి కాలనీ ,రాంనగర్ ప్రశాంత్ నగర్ , తిరుమల నగర్ , సీతారాం కాలనీ ,పొనుగోటి వలస అంబేద్కర్ కాలనీ తో పాటు పలు వార్డుల్లో ప్రచారం ముమ్మరంగా చేపట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింట ప్రచారం చేపట్టి తెలుగుదేశం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ కు ప్రతి ఒక్కరు ఓటు వేసి మరల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయాలని పిలుపునిచ్చారు .అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు .రాష్ట అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పారు . తమను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రాజాం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తానని అన్నారు.

Body:అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని రాజాం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని కొండ్రు మురళి అన్నారు

Conclusion:రాజాం లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ్రు మురళి విస్తృతంగా ప్రచారం చేపట్టారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.