ETV Bharat / state

పండ్లు.. కూరగాయల రైతులకు శుభవార్త

రైతులకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కూరగాయలు, పండ్లకు ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

author img

By

Published : Jul 2, 2019, 2:03 PM IST

కూరగాయలు, పండ్లు

వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కూరగాయలు, పండ్లకు ఫీజుల నుంచి మినహాయింపులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరనుంది. 1968 వ్యవసాయ మార్కెట్‌ చట్టం ప్రకారం వీటి క్రయ, విక్రయాలపై ఒక శాతం సుంకాన్ని వ్యవసాయ మార్కెట్లు వసూలు చేస్తున్నాయి. సుంకం మినహాయించటం వల్ల రైతులు నేరుగా కూరగాయలు, పండ్లు రాష్ట్రంలో ఎక్కడికైనా తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. మార్కెట్‌ కమిటీలకు ఎటువంటి సుంకం చెల్లించాల్సిన అవసరం ఉండదు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధిలోని చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, సిబ్బందికి మామూళ్లు వంటి ఇబ్బందులు ఉండవు. దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను మార్కెటింగ్ శాఖ జారీ చేసింది. మార్కెట్ కమిటీ యార్డుల వద్ద స్వేచ్ఛా వాణిజ్యం నిర్వహిస్తే మాత్రం ఒక శాతం సెస్సు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కొనుగోలు మొత్తంలో ఒక శాతం సెస్సును కొనుగోలుదారు మార్కెట్‌ కమిటీకి చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొంది.

Intro:AP_ONG_52_02_VANAM-MANAM_DSP_AVB_AP10136

నేటి విద్యార్థులే రేపటి పౌరులు అన్నట్లుగానే నేడు మనం నాటిన చిన్న మొక్కే రేపటికి వృక్షమోతుంది అంటున్నారు దర్శి డిఎస్పీ నాగరాజు.
ప్రకాశంజిల్లా దర్శిలోని మోడల్ స్కూల్ నందు వనం-మనం కార్యక్రమం పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించారు.దర్శి సబ్-డివిజనల్ పరిధిలోని అధికారులు,సిబ్బంది ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.స్కూల్ ఆవరణలో సుమారు నూరు మొక్కలదాకా నాటారు.వీరితోపాటు విద్యార్థిని,విద్యార్థులు మరియుప్రదానోపాధ్యాయురాలుపాల్గొన్నారు.ఈసందర్భంగా డిఎస్పీ నాగరాజు మాట్లాడుతూ మొక్కలునాటటంకాదు వాటిని పెంచి పెద్ద చేసినప్పుడే ఫలితం ఉంటుంది అన్నారు. నాటిన మొక్కలను పెంచే బాధ్యతను స్కూల్ సిబ్బందితో పాటు మా సిబ్బంది కూడా వారికి తోడుగా ఉంటారన్నారు. చెట్లు పెంచటంవలన కాలుష్యనియంత్రణ,సకాలంలో వర్షాలు పడటం జరుగుతుందన్నారు.
బైట్:- నాగరాజు దర్శి డిఎస్పీ

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.