ETV Bharat / state

భానుడి భగభగ.. సామాన్యుడికి ఎండల సెగ - ఆర్టీజీఎస్

రోహిణి కార్తె ఎండలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత, వడగాల్పులతో పగటి పూటి ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల చేరువలో ఉన్నాయని ఆర్టీజీఎస్ కేంద్రం తెలిపింది. ఇవాళ చిత్తూరు జిల్లా రేణిగుంటలో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

రాష్ట్రంపై భానుడి ప్రతాపం
author img

By

Published : May 29, 2019, 7:54 PM IST

Updated : May 29, 2019, 8:39 PM IST

రాష్ట్రంపై భానుడి ప్రతాపం
రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగిందని రియల్‌ టైం గవర్నెన్స్‌ (ఆర్టీజీఎస్‌) కేంద్రం తెలిపింది. భానుడి ప్రతాపానికి రోళ్లు సైతం పగులేంతగా వేడి గాలులు వీస్తున్నాయి. వడగాల్పులు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రోహిణి కార్తె ప్రవేశంతో ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి.

రాష్ట్రంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరువలో ఉన్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. చిత్తూరు జిల్లా రేణిగుంట‌లో అత్యధికంగా 46 డిగ్రీలు ఉష్ణోగ్రత న‌మోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీలు, మరో 50 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆర్టీజీఎస్ ప్రకటించింది.

4 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు

నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రత (డిగ్రీలలో)
రాపూరు 46
బోగోలు 45
క‌లిగిరి 45
చిల్లకూరు 45
నాయుడుపేట 44
చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రత (డిగ్రీలలో)
రేణిగుంట‌ 46
వ‌ర‌ద‌య్యపాలెం 46
బుచ్చినాయుడికండ్రిగ 45
ఏర్పేడు 45
చంద్రగిరి 44
శ్రీకాళహ‌స్తి 44
ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రత (డిగ్రీలలో)
పెద‌చెర్లోప‌ల్లి 45
బ‌ల్లికుర‌వ 45
కురిచేడు 45
వెలిగండ్ల 44
గుంటూరు జిల్లా ఉష్ణోగ్రత (డిగ్రీలలో)
దాచేప‌ల్లి 45

ఇవీ చూడండి : జిప్​లైన్​'తో విన్యాసాల అడ్డాగా ఈఫిల్​ టవర్​

Viral Advisory
Wednesday 29th May 2019
SPORT: Gymnast Dominick Cunningham makes amazing basketball trick shot. Already moved
Regards,
SNTV London
Last Updated : May 29, 2019, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.