ETV Bharat / state

'రుతుపవనాల విస్తరణకు అనువైన పరిస్థితులు' - కేరళ

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. నాలుగు రోజులు ఆలస్యంగా చేరుకున్నా... రుతుపవనాల రాకతో కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలఖరు వరకు నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించనున్నాయి. మరో 3రోజుల్లో రుతుపవనాలు రాయలసీమలోని అనంతపురం జిల్లాను తాకనున్నాయని వాతావరణశాఖ వివరించింది.

రుతుపవనాలు భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి
author img

By

Published : Jun 9, 2019, 5:49 AM IST

నైరుతీ రుతుపవనాలు భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. మాల్దీవులు, శ్రీలంక సమీపంలోని కామోరిన్, దక్షిణ అరేబియా సముద్ర ప్రాంతాల్లో విస్తరించిన రుతుపవనాలు... కేరళతీరంలోకి అడుగుపెట్టటంతో వర్షాలు కురుస్తున్నాయి. నాలుగురోజులు ఆలస్యంగా చేరుకున్నప్పటికీ... రుతుపవనాల ప్రభావంతో జోరుగా వానలు కురుస్తున్నాయి. కేరళ నుంచి కర్ణాటక, తమిళనాడులో విస్తరిస్తూ రాయలసీమ జిల్లాలకు చేరుకునేందుకు మరో 3రోజుల సమయం పడుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రుతుపవనాల విస్తరణకు అనువైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.

రుతుపవనాల రాకతో ఈ నెల 9, 10న కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా... ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. కొల్లాం, అలప్పుజ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... తదుపరి రోజు తిరువనంతపురం, పతినంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

రాష్ట్రంలోనూ చాలా చోట్ల ముందస్తు రుతుపవన జల్లులు నమోదవుతున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములుతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులతో పాటు వడగాడ్పులు కూడా వీస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే సూచనలున్నాయి. రాయలసీమ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే సూచనలున్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండీ...

10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్న నైరుతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.