ముఖ్యమంత్రి చంద్రబాబు సహా 21 విపక్ష పార్టీల నాయకులు నేడు దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. సోమవారం కోల్ కత్తాకు వెళ్లిన చంద్రబాబు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఇరువురి భేటీలో రాజకీయ పరిణామాలతో పాటు కూటమి ఏర్పాటు ప్రయత్నాలు చర్చకు వచ్చాయి. ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు తమతో కలిసి రావలసిందిగా మమతా బెనర్జీని చంద్రబాబు ఆహ్వానించారు.
ఈసీ వైఖరిపై ఆందోళనకు సిద్ధం...
ఈ మధ్యాహ్నం దిల్లీలో భేటీకాబోతున్న ఎన్డీయేతర పక్షాల నేతలు..ఎన్నికల్లో అక్రమాలు, ఈసీ పక్షపాత ధోరణిపైనా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో సమావేశం కానున్న నేతలు..పలు అంశాలపై చర్చించనున్నారు. అనంతరం ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు.
ధర్నా చేపట్టే అవకాశం..
వీవీప్యాట్ల లెక్కింపుపై మార్గదర్శకాల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం అందజేయనున్నారు. ఈసీ స్పందనను బట్టీ అవసరమైతే అక్కడే ధర్నా నిర్వహించేందుకు విపక్ష పార్టీల నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
హంగ్ ఏర్పడితే ఏంటన్న విషయంపై కూడా ...దిల్లీలో ఇవాళ భేటీకానున్న విపక్షనేతలు సమగ్రంగా చర్చించనున్నారు. భాజపాను నిలువరించేందుకు ఉన్న... ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదన్న ఆలోచనలో ఉన్న వీరు భవిష్యత్ కార్యచరణపై దృష్టిపెట్టనున్నారు.
నేడు ఎన్నికల సంఘం వద్దకు ఎన్డీయేతర పక్షాలు - రాహుల్
ఏపీ సీఎం చంద్రబాబు సహా 21 విపక్ష పార్టీల నేతలు నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపుపై మార్గదర్శకాల కోసం ఈసీకి వినతిపత్రం అందజేయనున్నారు. అంతకన్నా ముందు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో విపక్ష పార్టీల నేతల పలు అంశాలపై చర్చించనున్నారు.