ఒక రాష్ట్రం పట్ల వివక్ష చూపినప్పుడు న్యాయపోరాటం తప్పనిసరి అవుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మాట నిలబెట్టుకోని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ దిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేసేవరకు పోరాటం ఆగదని సీఎం తెలిపారు.
ఆత్మాభిమానులైన తెలుగు ప్రజలపై వివక్ష చూపితే.. ఆటలు సాగనివ్వమన్నారు. మమ్మల్ని లెక్కలడిగే ముందు, కేంద్రానికి మేం కట్టిన లెక్కలు చెప్పాల్సిన బాధ్యత లేదా అంటూ మోదీని నిలదీశారు. ఇప్పటికైనా ప్రధాని పశ్చాత్తాపపడాలని హితవు పలికారు. మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుని హోదాతో పాటు, ఇతర హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.