అమరావతిలో తెదేపానేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీబాధ్యులు, బూత్కన్వీనర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉగ్రదాడులను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని పార్టీ నేతలకు సూచించారు.భారత వాయుసేన ధైర్యసాహసాలను ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జవాను కుంటుంబానికి 5 లక్షల విరాళం ప్రకటించిందని గుర్తచేశారు. మన ఉద్యోగులంతా కలిపి 30 కోట్ల విరాళాలు సేకరించండం దేశానికే స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యనించారు. ఒకవైపు రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తున్నా...దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలు ఉండవచ్చు కానీ...దేశ భద్రత విషయంలో రాజకీయలకు అతీతమని పార్టీనేతలతో వ్యాఖ్యనించారు.నేడు దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల భేటి హాజరవుతున్నట్లు చెప్పారు.
![cm](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2560533_701_0237360d-ccbc-4f72-b34e-1420eb61f95f.png)