రాజ్యసభ అభ్యర్ధిగా ఎండీఎంకే చీఫ్ వైగో తమిళనాడు నుంచి నామినేషన్ వేశారు. ఆ రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు ఈనెల 18 న ఎన్నికలు జరగనున్నాయి. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే కు చెరో ముగ్గురు అభ్యర్ధులను తమ తమ పార్టీల తరఫున ఎన్నుకునేందుకు రాష్ట్ర శాసనసభలో బలాలున్నాయి. అయితే గత లోక్ సభ ఎన్నికలలో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఇరు పార్టీలు...ఒక రాజ్య సభ స్థానం కేటాయించాల్సి ఉంది. ఆ మేరకు అన్నాడీఎంకే తమ కోటాలోని ఒక స్థానం పీఎంకేకి, డీఎంకే తమ కోటాలోని ఒక సీటును వైగో నేతృత్వంలోని ఎండీఎంకేకి కేటాయించాయి. తనకు రాజ్యసభకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన డీఎంకేకి ...వైగో కృతజ్ఞతలు తెలిపారు.
నిషేధిత తీవ్రవాద సంస్థకు అనుకూలంగా, భారత సమగ్రతకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు చెన్నైలోని ప్రత్యేక కోర్టు వైగోకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది
ఇవీ చూడండి-'22 మంది ఎంపీలను గెలిపిస్తే...బడ్జెట్లో తెచ్చిందేమిటి'