గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తెదేపా తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన మద్దాలి గిరిధర్‌రావు ఎన్నిక రద్దు చేయాలని... వైకాపా అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం హైకోర్టును ఆశ్రయించారు. 5పేర్లతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేశారని ఆరోపించారు. నియోజకవర్గంలో మొత్తం 4040 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా... కేవలం 312 మాత్రమే చెల్లుబాటు అయినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్వో గిరిధరరావుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ విషయాలన్నింటిని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే గిరిధరరావు ఎన్నికను రద్దు చేయాలని కోరారు. తనను ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ప్రకటించాలని వ్యాజ్యంలో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ...