మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేతలతో సీఎం భేటీ అయ్యారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. రేపు చర్చకు వచ్చే ప్రశ్నలు, ఎవరేం మాట్లాడాలనే అంశంపైనా సమాలోచన చేశారు. చర్చ సందర్భంగా లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం జగన్ సూచనలు చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఎలా వ్యవహరించాలనే అంశంపై సీఎం మార్గనిర్దేశం చేశారు.
ఇదీ చదవండీ...