అనామిక అనే విద్యార్థిని.. తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చినప్పుడు తెలుగులో 20 మార్కులు వచ్చి ఫెయిల్ అయింది. మనస్తాపం చెందిన అనామిక ఆత్మహత్య చేసుకుంది. రీ వెరిఫికేషన్లో ఆ విద్యార్థినికి 48 మార్కులు వచ్చినట్లు ఆమె సోదరి హైదరాబాద్ ముక్దూం భవన్లో తెలిపారు. తన చెల్లిని ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని కన్నీరు పెట్టుకున్నారు. అనామిక మృతికి కారణమైన ఇంటర్ బోర్డ్ కార్యదర్శి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
ప్రభుత్వానిదే బాధ్యత
ఏప్రిల్18న ఫలితాల్లో 3 లక్షల మందికి పైగా పిల్లలు పాస్ కాలేదని బోర్డ్ చెప్పిందని గుర్తు చేశారు బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత రావు. మొన్న రీ వెరిఫికేషన్ తర్వాత చూస్తే అనామిక పాస్ అయినట్టుగా ఫలితం వచ్చిందని... ఇప్పుడు ఆమె మరణానికి తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: అదృశ్యమైన బాలుర మృతదేహాలు చెక్కపెట్టెలో లభ్యం