హైదరాబాద్ బాలాపూర్ సాయినగర్‌లో గాజుల కార్ఖానాల్లో పని చేస్తున్న 50 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పనిచేయిస్తున్న యజమానులను అదుపులోకి తీసుకున్నారు. బాలాపూర్ పోలీసులు దాడులు చేసి బాలకార్మికులకు విముక్తి కలిగించారు. వీరిని ఎవరు తీసుకొచ్చారు? ఎవరు పనులు చేయించుకుంటున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల వివరాలు సేకరించి స్వస్థలాలకు పంపిచనున్నారు.
ఇదీ చూడండి: ఆగస్టు 15లోపు మధ్యమానేరుకు కాళేశ్వరం నీరు