ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజా వినతుల దినం నిర్వహించాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు నిర్వహించాలన్నారు. సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. తద్వారా ఉత్తమ పోలీసింగ్ అందిచిన వారమవుతమన్నారు. వినతులను కంప్యూటర్లలో నమోదు చేసి నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలని ఆదేశించారు. వినతులపై తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు, బాధితులకు ఎప్పటికప్పుడు చేరవేయాలన్నారు. ప్రతినెలా ఎన్ని సమస్యలు పరిష్కరించారు ? అనే అంశం ఆధారంగా అధికారుల పనితీరును అంచనా వేయనున్నట్లు పేర్కోన్నారు.
ఇదీచదవండి