ETV Bharat / state

వైకాపా విధ్వంసం... ఓటింగ్​ హింసాత్మకం - attack on speaker kodela

గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామం చాలాచోట్ల హింసాత్మకంగా మారింది. అధికార, ప్రతిపక్ష కార్యకర్తలు పరస్పర ఘర్షణలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యర్థుల దాడుల్లో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు తెదేపా కార్యకర్తలు మృతి చెందారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సభాపతి కోడెల శివప్రసాదరావుపై... వైకాపా నేతలు దాడి చేయగా... ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అర్థరాత్రి వరకూ జరిగిన సంఘటనల్లో చాలామంది కార్యకర్తలు ఆస్పత్రి పాలయ్యారు.

వైకాపా విధ్వంసం... ఓటింగ్​ హింసాత్మకం
author img

By

Published : Apr 12, 2019, 11:58 AM IST

Updated : Apr 12, 2019, 12:39 PM IST

రాజకీయ పార్టీల ఆధిపత్య పోరుతో హింసాత్మక ఘటనలు జరిగాయి. ప్రత్యర్థుల దాడుల్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మృత్యువాతపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురం వద్ద పోలింగ్ కేంద్రంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో తెలుగుదేశం పార్టీకి చెందిన చింతా భాస్కర్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుం వద్ద తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు దాడి చేసుకోవటంతో ఘటనలో వృద్ధుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్లలో సభాపతి కోడెల శివప్రసాదరావును వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయనపై దాడి చేసి.. చొక్కా చించేశారు. కారు ధ్వంసం చేశారు. వైకాపా కార్యకర్తల దాడిలో సభాపతి అనుచరులు ముగ్గురు గాయపడ్డారు. నరసరావుపేట తెదేపా అభ్యర్థి అరవిందబాబుపై వైకాపా నేతలు..దాడి చేయగా.. చేయి విరిగిపోయింది.

ఈసీ తీరును నిరసిస్తూ మంత్రి లోకేశ్‌ చేసిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల సంఘం ఓటర్లకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం క్రిస్టియన్ పేటలోని 37వ పోలింగ్ కేంద్రం వద్ద లోకేశ్‌ ధర్నాకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేయడాన్ని నిరసిస్తూ... వైకాపా నేతలు ఆందోళన చేశారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. వైకాపా వర్గం ముందుకు దూసుకురావడంతో స్వల్ప లాఠీఛార్జీ చోటు చేసుకుంది. ఎస్పీ సూచన మేరకు లోకేశ్‌ ధర్నా విరమించి.. పోలింగ్ కేంద్రం బయటకు వచ్చారు. ఓటమిని జీర్ణించుకోలేకే వైకాపా రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పాల్పడిందని లోకేశ్ ట్వట్టర్​లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరులోని నల్లచెరువులో పోలింగ్ కేంద్రం వద్ద అధికార, ప్రతిపక్ష కార్యకర్తల ఆందోళన లాఠీ ఛార్జీకి దారితీసింది. ఎన్నికల సిబ్బంది వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తెదేపా శ్రేణులు ఆరోపించారు. అదే సమయంలో తెదేపా ఎంపీ అభ్యర్ధి గల్లా జయదేవ్ అక్కడికి చేరుకున్నారు. ఆయన లోపలికి వెళ్లి ఎన్నికల అధికారులతో మాట్లాడుతుండగా.. తెదేపా శ్రేణులు ధర్నా చేపట్టాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని 2 పక్షాల కార్యకర్తలను చెదరగొట్టారు. లాఠీ ఛార్జీలో 2 పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉదయం నుంచీ ఉద్రిక్తత కొనసాగింది. 143వ పోలింగ్ బూత్ విషయమై.. భూమా, గంగుల వర్గాల మధ్య వివాదం జరిగింది. పోలింగ్ సమయం ముగిసినా ఓటర్లును తెస్తున్నారంటూ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇరువురూ వాగ్వాదానికి దిగటంతో కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో ఆర్టీసీ బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలీసులు గాల్లోకి భాష్పవాయుగోళాలు ప్రయోగించి... పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.

దాడులు... ప్రతిదాడులతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రణరంగంలా మారింది. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వాహనంపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న జలీల్ ఖాన్ మద్దతుదారులు ప్రతిదాడికి పాల్పడ్డారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని శాంతింప చేశారు. విజయవాడలోని ప్రసాదంపాడులో తెదేపా, వైకాపా ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమయం ముగిసినా ఓటింగ్ కు అనుమతిస్తున్నారంటూ గొడవపడ్డారు. తెదేపా, వైకాపా వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. మహిళలను పోలీసులు దుర్భాషలాడారంటూ తెదేపా ఏజెంట్లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఫిర్యాదు చేశారు. దురుసు ప్రవర్తనపై ఎమ్మెల్యే పోలీసులను నిలదీశారు. తిరుపతి గ్రామీణ పరిధిలోని రామానుజపల్లెలో ఉద్రిక్తత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ సమయం ముగిసినా ఓటు వేసేందుకు అనుమతించాలని వైకాపా నేతలు పట్టుపట్టారు. తెదేపా శ్రేణులూ అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు తోపులాటకు దిగడంతో.. పోలీసులు చెదరగొట్టారు. తనపై చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పులివర్తి నాని సతీమణి గానసుధ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు.

ఎన్నికల్లో గెలవలేకే.. వైకాపా నేతలు దాడులకు పాల్పడ్డారని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎలాగైనా గెలివాలనే ఉద్దేశంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా... ప్రజలు తెలుగుదేశం పార్టీకే విజయం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వైకాపా నేతలు.. ఫ్యాక్షన్‌ కక్షలను రెచ్చగొట్టారంటూ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. రాప్తాడు నియోజకవర్గంలో సంఘటనలను జిల్లా ఎస్పీకి తెలిపారు. వైకాపా నేతల దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా నేతలు తన కుమారుడు శ్రీరామ్‌ కాన్వాయిపై రాళ్లు రువ్వారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరులోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థిని అదుపు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో పిఠాపురం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీఎన్​ఎస్ వర్మ వాహనంపై వైకాపా శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. పోలింగ్ కేంద్రానికి వాహనంపై వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి తెగబడ్డారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్ద వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు తనయడు రామ్‌మనోహర్‌ నాయుడు హల్‌చల్‌ చేశారు. టెక్కలి నియోజకవర్గంలోని నరేంద్రపురంలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపా కార్యకర్త వెంకటస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. మంత్రి అచ్చెన్నాయుడు పరామర్శించారు. ఓడిపోతామనే భయంతోనే కొడాలి నాని దాడులను ప్రోత్సహిస్తున్నారని గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ ఆరోపించారు. కృష్ణాజిల్లా పొలుకొండలో పోలింగ్‌బూత్‌లో రెండేసి ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలతో వైకాపా,తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దాడిలో తెదేపా కార్యకర్త శ్రీనివాసరావుపై వైకాపా కార్యకర్త సత్యనారాయణ కత్తితో దాడి చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తికోళ్లలంకలో తెలుగుదేశం పార్టీ, వైకాపా కార్యకర్తల మధ్య నెలకొన్న ఘర్షణలతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇరువర్గాల మధ్య దాడిలో 15మందికి గాయాలు అయ్యాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గాయపడిన వారిని పరామర్శించారు.

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం గోగులపాడులో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. విశాఖ జిల్లా గాజువాకలో వైకాపా, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పేర్ల అమ్మోరు అనే జనసేన కార్యకర్తకు తీవ్రంగా గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో 233 పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం వమ్మరవిల్లిలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తెదేపా నేత రాధాకృష్ణారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో వైకాపా ఏజెంట్లు.. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ తెదేపా ఏజెంటు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వైకాపా నేతలంతా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నరంటూ కోపంతో ఈవీఎంను పగలగొట్టాడు. విజయనగరం జిల్లా చినకుదమలో తెదేపా, వైకాపా నేతలు బాహాబాహీకి దిగారు. ఇరువర్గాల ఘర్షణతో కురుపాం వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్లే పుష్పశ్రీవాణిపై తెదేపా వర్గీయులు దాడి చేశారు. గుర్లమండలం సదానందపురంలో తెదేపా, వైకాపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కుర్చీలతో కొట్టుకోగా... ఓ కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది.

వైకాపా విధ్వంసం... ఓటింగ్​ హింసాత్మకం

ఇవీ చూడండి: జలీల్​ఖాన్ వాహనంపై వైకాపా నేతల దాడి

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_47_12_Accident_7Death_AV_C8

Body:అనంతపురం జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 42వ జాతీయ రహదారి తనకల్లు మండలం పరాకులవాండ్లపల్లి సమీపంలో మినీ బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు .ప్రమాద స్థలంలో అక్కడిక్కడే ఐదుగురు మృతి చెందారు. తనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఒకరు, కదిరి ప్రాంతీయ వైద్యశాలలో మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. కొక్కంటి క్రాస్ నుంచి ప్రయాణికులతో కదిరికి వస్తున్న మినీ బస్సుJ ప్రజల వైపు నుంచి మదనపల్లె వైపు వెళ్తున్న ట్రక్కును పరాకుల వాండ్ల పల్లి ౼ ఎర్రగుంటపల్లి గ్రామాల మధ్య మలుపులో ఢీకొంది. గాయపడిన వారిని హుటాహుటిన తనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. మరికొందరు బాధితులను కదిరి ప్రాంతీయ వైద్యశాల తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం వైద్యశాలకు తరలించారు. మృతుల్లో ఐదుగురు తనకల్లుకు చెందిన వారు కాగా మరో ఇద్దరు నంబులపూలకుంట మండలం యాదాల వాండ్ల పల్లి గ్రామస్తులని పోలీసులు తెలిపారు.
మృతుల వివరాలు
1)జయమ్మ ,నంబులపూలకుంట మండలం
2)రామచంద్రారెడ్డి ,నంబులపూలకుంట మండల
3)బాబ్జాన్ ,తనకల్లు
4)శివ గణేష్, తనకల్లు
5)భారతమ్మ, తనకల్లు
6)ఖాదర్ బాషా ,తనకల్లు
7)దస్తగిరి ,తనకల్లు

Conclusion:
Last Updated : Apr 12, 2019, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.