జగన్ ప్రసంగం తర్వాత నిమ్మల రామానాయుడు సున్నా వడ్డీ పథకం కొత్తదేమీ కాదని వ్యాఖ్యానించగా... సభలో గందరగోళం నెలకొంది. ఈ పథకం గతంలో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారని.. తమ ప్రభుత్వం సైతం దాన్ని కొనసాగించిందని తెలిపారు. దీనిపై జోక్యం చేసుకున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి తెదేపా విమర్శలు తప్పని నిరూపిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర రైతులకు తెదేపా ప్రభుత్వం సున్నా వడ్డీ పథకంపై రూపాయి కూడా ఇవ్వలేదని.. అవసరమైతే రికార్డులు తీసుకొస్తానని జగన్ అన్నారు. సున్నా వడ్డీకింద రైతులకు ఎంత డబ్బు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలన్నారు. తప్పని తేలితే చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళతారా అంటూ ప్రశ్నించారు. దీంతో సభలో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇదీ చదవండి: గత ప్రభుత్వ వైఫల్యంతోనే విత్తన కష్టాలు: సీఎం