ఎన్నికలు సమీపిస్తోండటంతో ఎన్డీయేతర పక్షాలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గత సమావేశంలోనే ప్రిపోల్ అలయెన్స్‌కు అంగీకరించిన్న పార్టీలు...ఈరోజు సమావేశంలో మరింత లోతుగా దానిపై చర్చించనున్నాయి. కూటమికి పూర్తిస్థాయి ఆమోదాన్ని తెలపని పార్టీల పట్ల ఎలాంటి వ్యూహం అవలంబించాలనే దానిపై నేతలు కసరత్తు చేయనున్నారు. దిల్లీలో ఆప్ కూడా కాంగ్రెస్‌తో కలసి వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నందున పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కేంద్రంపై తీసుకు రావాల్సిన ఒత్తిడిపైనా చర్చజరిగే అవకాశం ఉంది. రఫేల్ వంటి కుంభకోణాలు, పుల్వామా దాడిలో ఇంటిలిజెన్స్ వైఫల్యం, కేంద్రప్రభుత్వ అలసత్వం తదితర అంశాలే అజెండాగా సమావేశం జరగనుంది.
ఇతర రాష్ట్రాల్లో ప్రధాని మోదీకీ వ్యతిరేఖంగా చేపట్టాల్సిన ధర్నాలు ర్యాలీలు పై కూడా ప్రణాళిక చేయనున్నారు. చివరి ధర్మాపోరాట సభను అమరావతిలో నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ అంశంపై చర్చించనున్నారు. సాధారణ ఎన్నికల దగ్గర పడుతున్నందున అన్ని రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేఖంగా అక్కడి సమస్యలపై పోరాడాలని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించనున్నట్లు సమాచారం.
అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించినా...అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రిపోల్ అలయెన్స్ ఉపయోగపడుతుందని చంద్రబాబు అంచనా. స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొందరు భాజపాయేతర కూటమికి మద్దతు తెలపక పోయినా...ఎన్నికల తరువాత కలిసి వస్తారనిధీమా వ్యక్తం చేస్తున్నారు.
నేడు హస్తినకు చంద్రబాబు - కాంగ్రెస్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ...భాజపాయేతర పార్టీలు కార్యాచరణ ముమ్మరం చేస్తున్నాయి. ఈ మేరకు నేడు హస్తినలో సమావేశం నిర్వహించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కీలక నేతలు హాజరుకానున్నారు.