సామాజిక మాధ్యమాల్లో ఉన్న వీడియో దృశ్యాలు చంద్రగిరివి కావని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. చంద్రగిరి రీపోలింగ్‌పై పిటిషన్‌లో కోర్టుకు ఈసీ కౌంటర్, వీడియో దృశ్యాలు అందించామని వివరించారు. రీపోలింగ్ జరిగే ఏడు చోట్ల వీడియో ఆధారాలతోనే ఈసీ చర్యలు చేపట్టిందని ద్వివేది స్పష్టం చేశారు. 23వ తేదీలోగా ఎప్పుడైనా రీపోలింగ్ చేయొచ్చని పేర్కొన్నారు.
రీపోలింగ్‌కు సంబంధించిన లేఖను ఎన్నికల సంఘానికి సీఎస్ పంపడంలో తప్పేంటని ద్వివేది ప్రశ్నించారు. వీవీప్యాట్లలో మాక్ పోలింగ్ స్లిప్పులు తొలగించని వాటిని లాటరీ నుంచి మినహాయిస్తామని చెప్పుకొచ్చారు. ర్యాండమైజేషన్ నుంచి సీఆర్సీ చేయని వాటికి మినహాయింపు ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ల జారీలో ఎక్కడా అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు.
పోస్టల్ బ్యాలెట్లపై ఎవరైనా నేరుగా, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే స్పందిస్తామన్న ద్వివేది... లెక్కింపు రోజు ఫలితాలు వెల్లడించాల్సిన బాధ్యత ఆర్వో, పరిశీలకులదేనని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించాకే ఆర్వోలు ఫలితాలను ప్రకటించాలని సూచించారు. లెక్కింపునకు సంబంధించిన నిర్ణయాధికారాలు ఆర్వో, పరిశీలకులదేనన్న ద్వివేది... రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు విధుల్లో 200 మంది ఆర్వోలు, 200 మంది పరిశీలకులు ఉంటారని వెల్లడించారు.
ఇదీ చదవండి...