సీఎం జగన్ ఇంటి వద్ద 40రోజుల్లో 80 నిరసనలు జరిగాయని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. నిరసనల దృష్ట్యా సీఎం నివాసం వద్ద 144 సెక్షన్ విధించారని ఆరోపించారు. తెదేపా హయాంలో ఏనాడు ఇలా చేసిన దాఖలాలు లేవని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్మించిన ప్రజావేదిక కూల్చారని వాపోయారు. రాత్రులూ జగన్ నివాసం వద్ద కొవ్వొత్తుల నిరసనలు జరుగుతున్నాయని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన ఒక్కో పథకాన్ని జగన్ రద్దు చేస్తున్నారని... రేపో, మాపో అన్నా కాంటీన్లు మూసేసే దిశగా వెళ్తున్నారు విమర్శించారు.
'రేపో, మాపో... అన్నా కాంటీన్లు మూసేస్తారు' - 144
వైకాపా ప్రభుత్వ పనితీరుపై తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ప్రజలు పడిగాపుల కాస్తున్నారని వాపోయారు.