ETV Bharat / state

Youngman Variety Marriage Proposal in Bapatla: వధువు కావలెను.. ఇట్లు పెళ్లి కాని ప్రసాద్​ - ఆంధ్రప్రదేశ్​ తాజా వార్తలు

Variety Marriage Proposal In Bapatla : జీవిత భాగస్వామి కోసం ఓ యువకుడు ఏకంగా సైకిల్​ యాత్ర ప్రారంభించాడు. జనం ఉన్న చోటుకు వెళ్లి బ్యానర్​తో ప్రచారం చేస్తున్నాడు. ఈ వినూత్న వివాహ ప్రపోజ్​ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా వేటపాలం మండలంలోని ఓ యువకుడు చేపట్టాడు. కానీ చివరకు ట్విస్ట్​ ఏంటంటే..!

Etv BharatRegistration Compulsory For Marriage
Etv BharatVariety Marriage Proposal In Bapatla
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 4:45 PM IST

Variety Marriage Proposal In Bapatla: రాజుల కాలంలో తమ కలల రాకుమారి కోసం రాజులు గుర్రాలపై రాజ్యమంతా తిరిగి పెళ్లిళ్లు చేసుకునేవారు. అది మనందరికీ తెలిసిన చరిత్రే... కానీ ఈ తరం వాళ్లు తమ వధువు కోసం.. మ్యాట్రిమోనీ యాప్​లు, పెళ్లిళ్ల బ్యూరోల చుట్టూ తిరుగుతున్నారు. అంత తతంగం ఇష్టంలేని వాళ్లు చక్కగా తల్లిదండ్రులు చూసిన అమ్మాయినో, మనసుకు నచ్చిన భామనో మనువాడాలనుకుంటున్నారు. కానీ వీటన్నింటికి భిన్నంగా ఓ వ్యక్తి తన సైకిల్​నే రథమని భావించి ఫ్లెక్సీపై ఆహ్వాన పత్రంతో జీవిత భాగస్వామి కోసం బయలుదేరాడు. ఇంత వింతగా వెతుకుతున్న వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందామా.

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన ఓ యువకుడు తన జీవిత భాగస్వామి కోసం సైకిల్​పై తిరుగుతున్నాడు. పెళ్లెప్పుడవుతుంది బాబూ.. నాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబోయ్​.. అంటూ వేటపాలెం నుంచి చీరాల వరకు సైకిల్​పై తిరుగుతూ.. ముఖ్య కూడళ్లలో తన కాబోయే శ్రీమతి తనను వరించాలంటే ఏం చెయ్యాలనే అంశాలతో ప్లెక్సీ ప్రదర్శిస్తూ.. అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు.

అనంతపురం జిల్లాలో వింత ఆచారం.. వర్షాలు పడాలని గాడిదలకు పెళ్లి

Registration Compulsory For Marriage : యుక్త వయస్సు దాటుతున్నా పెళ్లి కాకపోవడంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు బీకాం చదువుకున్న నీలకంఠం అయ్యప్ప కుమార్​. తనను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు వారి పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఏకంగా నడిరోడ్డుపై స్వయంవరానికి కౌంటర్​ను ఏర్పాటు చేశాడు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన దేవన నీలకంఠం అయ్యప్ప కుమార్ అనే యువకుడు బీకాం చదివాడు.. ఇతనికి ఇరవయేళ్ల వయసు దాటినా ఇంకా పెళ్లి కాకపోవడంతో ఇలా చేస్తున్నాడు. తనంటే ఇష్టపడే అమ్మాయిలు.. తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చీరాలలోని పలు ప్రాంతాల్లో సైకిల్​పై తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోదలచిన వారు తమ పేరు, ఫోన్ నంబర్​ను తన వద్ద ఉన్న పుస్తకంలో రాయాలని లేదా స్వయంగా తన ఇంటికి రావాలంటూ చెబుతున్నాడు. తన ఇంటి గోడపైన కూడా వివరాలు రాశాడు.

ఎమ్మెల్యే కుమార్తె ప్రేమ వివాహం.. దగ్గరుండి జరిపించిన రాచమల్లు

'నిజంగా ఇష్టం ఉన్న వాళ్లు మాత్రమే నన్ను కలవండి. ఫోన్లు, మెసెజ్​లు అని సమయం వృథా చెయ్యకండి. నన్ను ఇష్టపడితే నేరుగా మా ఇంటికి వచ్చి.. నాతో మాట్లాడండి.పెళ్లి కోసం నేను గొడుగు పట్టుకొని, బ్యానర్​తో పలు ప్రాంతాలకు వెళ్లాను' -నీలకంఠం అయ్యప్ప కుమార్

Bride Need : అసలు విషయం ఏంటంటే అయ్యప్పకుమార్​కు మతిస్థిమితంగా లేదని అంటున్నారు అతడి బంధువులు. గతంలో కూడా ఇదేవిధంగా వాల్ పోస్టర్లను అంటించి తన ఇంటి గోడలపై అమ్మాయిలు తనకు ఫోన్ చేయాలంటూ రాశాడు. దీంతో వేటపాలెం పోలీసులు అయ్యప్పను అదుపులోకి తీసుకొని విచారించారు. ఇతనికి మతిస్థిమితం సరిగా లేదని తెలుసుకున్న పోలీసులు మందలించి పంపించారు. మళ్లీ తాజాగా తనను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిలు ఇవి తప్పక చెయ్యాలి అంటూ, కాంటాక్ట్​ నంబర్​ రిజిస్ట్రేషన్​ అంటూ సైకిల్​ విహారాలు మొదలెట్టాడు.

ఏదేమైనా పెళ్లి అవ్వట్లేదని మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకునేవారి కంటే ఇతడే మేలు అంటున్నారు స్థానికులు.

ఉదయం ప్రేమ పెళ్లి.. మధ్యాహ్నం డిగ్రీ ఎగ్జామ్.. బైక్​పై కాలేజ్​కు వెళ్లిన వధూవరులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.