Vikarabad Road Accident Today: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ధరూర్ మండలం కేరెల్లి బాచారం బ్రిడ్జి వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మృతులు ఆటో డ్రైవర్ జమీల్, హేమ్లా, రవి, కిషన్, సోనీ బాయ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
ఇవీ చూడండి..