Ramulavari Kalyana Thalambralu: భద్రాద్రి సీతారామ కల్యాణానికి బాపట్ల జిల్లా చీరాల నుంచి ఆఖరి విడతగా తలంబ్రాలు తరలివెళ్లాయి. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో కన్నుల పండువగా నిర్వహించే సీతారాముల కల్యాణానికి ఏటా చీరాల నుంచే గోటితో ఒలిచిన తలంబ్రాలను పంపిస్తూ వస్తున్నారు. వరుసగా ఎనిమిదోసారి ఈ అవకాశాన్ని చీరాల రఘురామభక్త సమాజం దక్కించుకుంది. గత ఐదు నెలలుగా, సుమారు 7 వేల మంది భక్తులు నియమనిష్ఠలతో గోటితో ఒడ్లను ఒలిచి.. క్వింటా 54 కిలోల బియ్యాన్ని విడతల వారీగా భద్రాచలం పంపించారు. ఆఖరివిడతగా పసుపు, కుంకుమ కలిపిన తలంబ్రాలను.. భద్రాచలానికి తీసుకెళ్లారు. తలంబ్రాల్లో కలిపే పసుపును.. మహిళల స్వయంగా రోకళ్లతో దంచి తయారుచేశారు.
ఇదీ చదవండి: "కరెంటు కోతల్లో.. ఒక విధానం లేదా?" సర్కారు తీరుపై జనాగ్రహం