ETV Bharat / state

TDP MLA Yeluri Samba Siva Rao on Votes Deletions: 'ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ కుట్ర.. అర్హుల ఓట్ల తొలగింపుపై దృష్టి' - latest news in ap

TDP MLA Yeluri Samba Siva Rao on Votes Deletions: టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకే వైసీపీ కుట్ర పన్నుతుందని తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి ఓట్లు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగిస్తున్నారన్నారు.

TDP_MLA_Yeluri_Samba_Siva_Rao
TDP_MLA_Yeluri_Samba_Siva_Rao
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2023, 5:37 PM IST

TDP MLA Yeluri Samba Siva Rao on Votes Deletions: ప్రజా వ్యతిరేకతను గ్రహించిన వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వం.. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న దుర్భుద్ధితో దొంగ ఓట్లను సృష్టించి, అర్హుల ఓట్ల తొలగింపుపై దృష్టి పెట్టిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. అర్హుల ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు కోసమే వైసీపీ ప్రభుత్వం తాడేపల్లిలోని ఓ హోటల్లో, హైదరాబాద్​లో 800 మందితో ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసిందని ఆరోపించారు. రిప్రంజటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్-(Represenation of People Act) 1956 లోని కొత్త నిబంధనను కాదని, 1950 యాక్ట్​లోని పాత నిబంధనల ప్రకారం, జగన్ ప్రభుత్వం అర్హుల ఓట్ల తొలగింపునకు సిద్ధమైందని ధ్వజమెత్తారు.

MLA Eluri Sambasiva Rao Letter to EC on Deletion of Votes: ఈసీకి ఎమ్మెల్యే ఏలూరి మరో లేఖ.. ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదు

Votes Deletion Issue in AP: ఓటర్లకు తెలియకుండా వారి పేరుతో వైసీపీ నియమించిన కిరాయి వ్యక్తులే ఇష్టానుసారం ఫామ్-7 దరఖాస్తులు ఆన్​లైన్లో అప్​లోడ్ చేస్తున్నారని సాంబశివరావు మండిపడ్డారు. ఒకే వ్యక్తి సిమ్ కార్డులు మారుస్తూ, 300 నుంచి 400 వరకు ఫామ్-7 దరఖాస్తులు అప్​లోడ్ చేస్తున్నాడని ఆరోపించారు. ఉపాధి నిమిత్తం గ్రామాలు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు వాలంటీర్లు, స్థానిక వైసీపీ నేతల ద్వారా సేకరిస్తూ అధికార పార్టీ ఇష్టానుసారం అర్హుల ఓట్ల తొలగిస్తోందని దుయ్యబట్టారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో 40వేల దొంగ ఓట్లు ఉన్నాయన్న ఆమంచి ఆరోపణలు పచ్చి అబద్ధమన్నారు.

No Action Against on Votes Deletion in AP: రాష్ట్రంలో ఓట్ల తొలగింపును ఈసీ ఎందుకు ఉపేక్షిస్తోంది..

TDP Supporters Votes Deletion in AP: పది సంవత్సరాల్లో పది వరకు చిన్నాచితకా ఎన్నికలు.. నియోజకవర్గంలో జరిగితే ఏనాడూ దొంగ ఓట్ల ప్రస్తావన తీసుకురాని వైసీపీ అసత్యాలు చెప్పడం కుట్రలో భాగమేనన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పర్చూరు నియోజకవర్గంలో 40వేల టీడీపీ ఓట్లు తొలగించి, ఎలాగైనా గెలవాలన్నదే అధికార పార్టీ ఆలోచన అని విమర్శించారు. పర్చూరు నియోజకవర్గంలోని ఓట్ల తొలగింపునకు సంబంధించి గంపగుత్తగా నమోదైన 15వేల ఫామ్-7 దరఖాస్తులపై చంద్రబాబు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారన్నారు. భారత ఎన్నికల సంఘం నిబంధనావళికి విరుద్ధంగా వైసీపీ అర్హుల ఓట్లు తొలగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీ కుట్రలపై అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Mistakes in Uravakonda Voters List ఆ 50 ఇళ్లకు.. మూడే డోర్​ నెంబర్లు! బాబోయ్ ఇదేం లెక్క..

"సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ దొంగ ఓట్ల సృష్టి, అర్హుల ఓట్ల తొలగింపు చేపట్టింది. తాడేపల్లి, హైదరాబాద్‌లో 800 మందితో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. 1950 చట్టం పాత నిబంధనలతో అర్హుల ఓట్లు తొలగించేందుకు సిద్ధం అయ్యారు. వైసీపీ కిరాయి వ్యక్తులే ఆన్‌లైన్‌లో ఫామ్-7 దరఖాస్తులు ఇస్తున్నారు. సిమ్‌లు మారుస్తూ వందల సంఖ్యలో ఫామ్-7 దరఖాస్తులు అప్‌లోడ్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినవారి వివరాలు సేకరించి ఓట్లు తొలగిస్తున్నారు. పర్చూరులో 40 వేల దొంగఓట్లు ఉన్నాయన్న ఆరోపణలు అబద్ధం."-ఏలూరి సాంబశివరావు, తెలుగుదేశం ఎమ్మెల్యే

YCP Removing TDP Votes: అనుకూలమైతేనే ఓటర్ల జాబితాలో పేరు.. ఇదే అధికార పార్టీ తీరు

Bogus Votes in AP: ఇబ్బడిముబ్బడిగా బోగస్‌ ఓట్లు.. ఏ బూత్​ చూసినా అవే

TDP Chief Chandrababu Will Go to Delhi on August 27: ఓట్ల తొలగింపు వ్యవహారం.. రంగంలోకి చంద్రబాబు.. ఈ నెల 27న దిల్లీకి పయనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.