Snow At Martur On National Highway: బాపట్ల జిల్లా పర్చూరులో పొగమంచు దట్టంగా అలుముకుంది. మంచు కారణంగా రోడ్లపై కనీస దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. 16 నెంబరు జాతీయరహదారిపై మార్టూరు వద్ద పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మంచు తీవ్రతకు కొందరు వాహనాలను నిలిపివేయగా, మరికొందరు నెమ్మదిగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఉదయం 9 గంటలైనా మంచు తగ్గకపోవటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
పొగమంచు అందాలు: కోనసీమలో పొగ మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు కొత్తపేట మండలం పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి అధికంగా పొగ మంచు కురవడంతో రహదారులన్నీ మంచుతో కమ్మేశాయి. రహదారిపై వెళ్లే వాహనాలు పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాల్లో పంట పొలాలకు వెళ్లే రైతులు పొగ మంచు అందాలను వీక్షిస్తున్నారు.
ఇవీ చదవండి